ముస్తఫా ఇంటికి నూజివీడు పోలీసులు
NEWS Jul 31,2026 12:41 pm
గుంటూరు తూర్పు నియోజకవర్గం వైసీపీ మాజీ ఎమ్మెల్యే షేక్ మహమ్మద్ ముస్తాఫా, ఆయన కుమారుడు బషీర్‌పై పోలీసులు కిడ్నాప్, క్రిమినల్ బెదిరింపుల కేసు నమోదు చేశారు. నూజివీడుకు చెందిన పొగాకు వ్యాపారి కిడ్నాప్ కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే ముస్తాఫా నివాసానికి నూజివీడు పోలీసులు వెళ్లారు.ఆ సమయంలో వారు లేకపోవడంతో భార్యతో మాట్లాడారు. ముస్తఫా ఇంటి వద్ద అంబటి రాంబాబు, ఇతర వైసీపీ నేతలు హడావుడి చేశారు.