43 ఏళ్ల తర్వాత విజయనగరానికి ప్రధాని
NEWS Aug 01,2026 11:49 am
ఈసారి భోగాపురంలో ప్రధాని మోడీ పర్యటనకు విశిష్టత ఏర్పడింది. దాదాపు 43 ఏళ్ల తర్వాత ఒక ప్రధాని విజయనగరం నేలపై కాలుమోపడంతో ఉత్తరాంధ్రవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. కేవలం 31 నెలల వ్యవధిలోనే అత్యంత వేగవంతంగా పూర్తయిన గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం భోగాపురం. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని భోగాపురంలో ప్రారంభించడం తనకెంతో ఆనందంగా ఉందన్నారు ప్రధాని మోడీ.