క్యాన్సర్ ఆస్పత్రి వద్ద అన్నదానం
NEWS Aug 02,2026 03:54 pm
HYD: బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద రెడీ టూ సర్వ్ ఫౌండేషన్, అమ్మ హెల్పింగ్ హాండ్స్ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో డా. మధు విజయ్ తనయుడు చిన్నారి వసుమనాస్ కార్తికేయ జన్మదిన దినోత్సవం సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పేద రోగులు, వారి కుటుంబ సభ్యులు, అవసరమైన వారికి 300 మందికి భోజనం పంపిణీ చేశారు. సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలనుకునే దాతలు, స్వచ్ఛంద సేవకులు తమను సంప్రదించాలని నిర్వాహకులు పెద్ది శంకర్ కోరారు.