దివ్యాంగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్
NEWS Aug 05,2026 11:56 am
దివ్యాంగులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మనమిత్ర వాట్సప్ గవర్నెన్స్‌లో మరికొన్ని సేవలు అందుబాటులోకి వచ్చాయి. తాజాగా సదరం సేవలు మనమిత్ర లోకి వచ్చేశాయి. దివ్యాంగులకు సదరం సేవలు మరింత సులభతరం అయ్యాయి. మనమిత్ర ద్వారా సదరం స్లాట్ బుక్ చేసుకోవచ్చని...అలాగే స్లాట్ లభ్యతను తెలుసుకోవచ్చని ఆర్టీజీఎస్ అధికారులు వెల్లడించారు.