అంబటి రాంబాబుకి ఇంకో షాక్
NEWS Aug 06,2026 03:12 pm
వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకి చిక్కులు తప్పడంలేదు. తాజాగా ఆయనపై గుంటూరు అరండల్‌పేట పోలీస్‌స్టేషన్‌లో మరో కేసు నమోదైంది. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌పై అసత్య ప్రచారం చేస్తూ, రాజకీయ విద్వేషాలు రెచ్చగొట్టేలా, ప్రజాశాంతికి భంగం కలిగించేలా వీడియో పోస్టు చేశారంటూ టీడీపీ జిల్లా అధ్యక్షుడు పిల్లి మాణిక్యరావు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు బీఎన్‌ఎస్ సెక్షన్లు 356, 353, 352, 61(2), 3(5) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.