సీదిరి అప్పలరాజు రిమాండ్ పొడిగింపు
NEWS Aug 06,2026 03:15 pm
మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకి శ్రీకాకుళం కోర్ట్ షాకిచ్చింది. ఆయన రిమాండ్‌ను మరో 14 రోజులు పొడిగించింది. మరోవైపు ఆయన బెయిల్ పిటిషన్‌పై విచారణను సోంపేట కోర్టు వాయిదా వేసింది. కాశీబుగ్గలో జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో సాక్ష్యాలు తారుమారు చేశారనే అభియోగాలపై అప్పలరాజును పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో గొర్రెల కాపరి దానయ్య మరణించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో సీదిరి అప్పలరాజు ఏ3గా ఉన్నారు.