డిజిటల్ చెల్లింపులు ఇక భారమేనా?
NEWS Aug 07,2026 01:13 pm
డిజిటల్ చెల్లింపులు ఇకపై భారంగా మారనున్నాయి. ఎంపిక చేసిన డిజిటల్ లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ ఛార్జీ విధించేందుకు బ్యాంకులు, చెల్లింపుల సేవా సంస్థలకు అధికారం కల్పించే సవరణ బిల్లు ఆమోదం పొందింది. రూ.50 కోట్ల కంటే ఎక్కువ వార్షిక టర్నోవర్ కలిగి ఉండే పెద్ద వ్యాపార సంస్థలు రూపే డెబిట్ కార్డులు, భీమ్-యూపీఐ క్యూఆర్ కోడ్‌ల ద్వారా జరిపే వినియోగదారుల లావాదేవీలను ఉచితంగానే స్వీకరించాలి.ఇకపై బ్యాంకులు, సేవలను అందించే ఐటీ మౌలిక వసతుల సంస్థలు నిర్దేశిత ఛార్జీ వసూలు చేసుకోవచ్చు.