తిరుమల క్యూలైన్లలో అన్నప్రసాదాల పంపిణీ
NEWS Aug 07,2026 02:17 pm
తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్. శ్రీవారి భక్తులకు క్యూలైన్లలో అన్నప్రసాదాల పంపిణీని మరింత సులభతరం చేసేందుకు టీటీడీ సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. రద్దీ సమయాల్లో భక్తులకు ప్రసాదాలు అందించే శ్రీవారి సేవకులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మూవింగ్ టేబుల్‌ను ప్రయోగాత్మకంగా క్యూలైన్‌లో అందుబాటులోకి తెచ్చారు. దాదాపు రూ.10 లక్షల వ్యయంతో ఏడు మీటర్ల పొడవుతో దీన్ని రూపొందించారు.