విజయ డెయిరీ చైర్మన్ ఎన్నిక రచ్చ
NEWS Aug 07,2026 02:21 pm
విజయ డెయిరీ చైర్మన్ ఎన్నిక వ్యవహారంపై తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం సీరియస్ అయింది. చైర్మన్ ఎన్నిక ఆలోచించి చేద్దామన్న అధిష్ఠానం సూచనను చలసాని ఆంజనేయులు ధిక్కరించారు. పార్టీ అధిష్ఠానం సూచనలు బేఖాతరు చేస్తూ ఆయన నామినేషన్ దాఖలు చేశారు. ఈ నామినేషన్‌ను ఉపసంహరించుకోవాలంటూ ఆయనను పార్టీ ఆదేశించింది. దీనిని ఆయన ధిక్కరించారు. ఈ నేపథ్యంలో పార్టీ కావాలో? పదవి కావాలో? తెల్చుకోవాలంది.