ఇంటెలిజెన్స్ ఏఎస్‌ఐగా అబ్దుల్ రషీద్
NEWS Aug 07,2026 06:53 pm
కోరుట్ల ఇంటెలిజెన్స్ విభాగానికి చెందిన అబ్దుల్ రషీద్ హెడ్ కానిస్టేబుల్ నుంచి అసిస్టెంట్ సబ్‌ఇన్‌స్పెక్టర్ (ఏఎస్‌ఐ)గా పదోన్నతి పొందారు. ఈ సందర్భంగా ఆర్‌ఐఓ మోహన్ ఆయనకు ఏఎస్‌ఐ హోదాకు సంబంధించిన స్టార్ చిహ్నాన్ని అలంకరించి శుభాకాంక్షలు తెలిపారు. పదోన్నతి అనేది హోదా పెరగడమే కాకుండా బాధ్యతలు కూడా పెరుగుతాయని పేర్కొంటూ, కొత్త బాధ్యతలను సమర్థంగా నిర్వహించాలని ఆకాంక్షించారు.