పాఠశాలపై చర్యలు తీసుకోవాలి: SFI
NEWS Aug 08,2026 06:40 pm
నారాయణపేట జిల్లా కేంద్రంలోని కాకతీయ పాఠశాల యజమాన్యం ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా తరగతులు నిర్వహిస్తుందని SFI నారాయణపేట జిల్లా కమిటీ డిమాండ్ చేశారు. ఈ రోజు రెండో శనివారం (ప్రభుత్వ సెలవు దినం) అయినప్పటికీ 10వ తరగతి విద్యార్థులకు కాకతీయ పాఠశాల యాజమాన్యం తరగతులు నిర్వహిస్తున్నట్లు విద్యార్థుల ద్వారా సమాచారం అందిందాని, తరగతులను బంద్ చేశామని SFI నారాయణపేట జిల్లా కార్యదర్శి పవన్ కుమార్, జిల్లా అధ్యక్షుడు భానుప్రసాద్ అన్నారు. విద్యా శాఖ అధికారి పాఠశాల పై చర్యలు తీసుకోవాలన్నారు.