ఏపీ విజయ డెయిరీ చైర్మన్ పదవికి చలసాని రాజీనామా
NEWS Aug 08,2026 02:32 pm
ఏపీ విజయ డెయిరీ చైర్మన్ పదవికి చలసాని ఆంజనేయులు రాజీనామా చేశారు. మరొకరికి అవకాశం ఇవ్వాలని టీడీపీ అధిష్ఠానం నిర్ణయించడంతో బుజ్జగింపుల మధ్య ఆయన వెనక్కి తగ్గారు. అంతకుముందు మూడోసారి చైర్మన్‌గా ఆంజనేయులు ఏకగ్రీవ ఎన్నికయ్యారు. మంత్రులు కొల్లు,పార్థసారథితో చర్చల తర్వాత రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.