గ్రామ టీఆర్‌ఎస్ అధ్యక్షుడిగా బట్టు లక్ష్మణ్
NEWS Aug 08,2026 06:42 pm
ఎల్లారెడ్డి నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఎదురుగట్ల సంపత్ గౌడ్ ఆదేశాల మేరకు లింగంపేట్ మండలం బోనాల్ గ్రామ టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడిగా బట్టు లక్ష్మణ్‌ను నియమించినట్లు మండల పార్టీ అధ్యక్షుడు పోకల సాయిరాం తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని లక్ష్మణ్‌ను నాయకులు కోరారు. మండల యూత్ అధ్యక్షుడు మోహన్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రతాప్‌రెడ్డి, జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షుడు జైల్ సింగ్, గోవర్ధన్‌రెడ్డి, జిల్లా ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్, మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు బ్యాగరి సాయిలు, మండల కార్యదర్శి మహేందర్, సీనియర్ నాయకులు పరందాములు, శేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.