తొలి కాన్పులోనే ముగ్గురు పిల్లలు
NEWS Aug 10,2026 05:24 pm
ఒకే కాన్పులో ఓ మహిళ ముగ్గురు శిశువులకు జన్మనిచ్చింది. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం రాజేశ్వర్‌రావుపేటకు చెందిన జంగిటి రాజలక్ష్మి–నరేందర్ దంపతులకు ఇది తొలి సంతానం. రాజలక్ష్మికి ప్రసవ నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు మెట్‌పల్లిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు ప్రసవం నిర్వహించగా ఒకే కాన్పులో ముగ్గురు శిశువులు జన్మించారు. దీంతో కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.