మెడికో ప్రియాంక ఫ్యామిలీకి 20 లక్షలు
NEWS Aug 10,2026 03:36 pm
రాజమండ్రిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మెడికో ప్రియాంక కన్నుమూసింది. ఈ ఘటనలో మెడికో ప్రియాంక ప్రాణాలు కోల్పోవడం బాధాకరం అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. నారు. ఎంతో భవిష్యత్ ఉన్న ఒక వైద్య విద్యార్థిని ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని సీఎం సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రియాంక ప్రాణాలు కోల్పోయిన ఘటనపై జిల్లా అధికారులతో సమీక్షించారు. ప్రియాంక మృతికి కారణమైన నిందితులు ఇప్పటికే అరెస్టై జైల్లో ఉన్నారని ఎస్పీ వివరించగా.... నిర్లక్ష్యంతో నిండు ప్రాణం తీసిన వారిపై కఠిన సెక్షన్లతో శిక్షలు పడేలా చూడాలన్నారు.