యువతికి యశోద వైద్యుల పునర్జన్మ
NEWS Aug 12,2026 01:39 pm
ప్రాణాంతకమైన అరుదైన రక్త సంబంధిత వ్యాధితో తీవ్ర అనారోగ్యానికి గురైన నిజామాబాద్‌కు చెందిన యువతికి హైదరాబాద్ సోమాజిగూడలోని యశోద ఆసుపత్రి వైద్యులు మెరుగైన చికిత్స అందించి ప్రాణాలు కాపాడారు. హీమటాలజీ వైద్య బృందం క్లిష్టమైన కేసును విజయవంతంగా పరిష్కరించింది. పరీక్షల్లో యువతి టీటీపీ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు గుర్తించారు. శరీరంలోని చిన్న రక్తనాళాల్లో సూక్ష్మ రక్తం గడ్డలు ఏర్పడటం వల్ల ఈ వ్యాధి సంభవిస్తుందని వైద్యులు తెలిపారు. ట్రాన్స్‌ఫ్యూజన్ వైద్య నిపుణుడు డా. విక్రమ్ కుమార్ నేతృత్వంలో చికిత్స అందించి యువతిని కోలుకునేలా చేశారు.