వాల్మీకి నగర్లో బతుకమ్మ సంబరాలు
NEWS Oct 17,2026 08:12 pm
నిర్మల్: దేవీ నవరాత్రుల సందర్భంగా నిర్మల్ జిల్లా కేంద్రంలోని వాల్మీకి నగర్ కాలనీలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. వివిధ రకాల పూలతో అందంగా అలంకరించిన బతుకమ్మలను మహిళలు తలపై ఎత్తుకుని ఒకచోట చేర్చారు. అనంతరం బతుకమ్మ పాటలు పాడుతూ, కోలాటాలు వేస్తూ ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం బతుకమ్మ పండుగను జరుపుకోవడం ఆనందంగా ఉందని మహిళలు తెలిపారు. నిర్మల్ జిల్లాతో పాటు తెలంగాణవ్యాప్తంగా ఆడపడుచులు సంప్రదాయబద్ధంగా ఈ పండుగను జరుపుకోవడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో కాలనీ మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.