రూ.1కే 24జీబీ డేటా ఆఫర్!
NEWS Oct 17,2026 08:19 pm
ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ కొత్త కస్టమర్ల కోసం ప్రవేశపెట్టిన ఫ్రీడమ్ 2.0 ఆఫర్ గడువును 2026 నవంబర్ 9 వరకు పొడిగించినట్లు సమాచారం. ఈ ఆఫర్లో కేవలం రూ.1తో 24 రోజులపాటు రోజుకు ఒక జీబీ చొప్పున మొత్తం 24 జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్ల చొప్పున మొత్తం 2,400 ఎస్ఎంఎస్లు పొందవచ్చు. కొత్తగా బీఎస్ఎన్ఎల్ కనెక్షన్ తీసుకునే వినియోగదారులకే ఈ ఆఫర్ వర్తిస్తుంది. సిమ్ కార్డు ఉచితంగా అందించే అవకాశం కూడా ఉంది.