మెట్పల్లి కెమెరా క్లబ్ ఆధ్వర్యంలో సభ్యుల కుమార్తెలకు సన్మానం
NEWS Oct 18,2026 06:16 pm
వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచి విజయాలు సాధించిన మెట్పల్లి కెమెరా క్లబ్ సభ్యుల కుమార్తెలను క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. దేశరాజ్ శేఖర్ కుమార్తె హరిత తొలి ప్రయత్నంలోనే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో ప్రొబేషనరీ ఆఫీసర్ ఉద్యోగం సాధించారు. గట్టడి దత్తాత్రి (దత్తు) కుమార్తె వర్షిత జాతీయస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో ఉత్తమ ప్రతిభ కనబరిచి పార్లమెంట్లో ప్రసంగించే అవకాశాన్ని దక్కించుకున్నారు. ఎస్పీ శ్రీధర్ కుమార్తె వేదశ్రీ పాలిసెట్ ప్రవేశ పరీక్షలో 120 మార్కులకు 117 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో 121వ ర్యాంకు పొందారు. మెట్పల్లి కెమెరా క్లబ్ ఆధ్వర్యంలో ముగ్గురు యువతులకు ప్రోత్సాహకంగా సన్మానం నిర్వహించారు. వారి విజయాలు ఇతర విద్యార్థులకు స్ఫూర్తిదాయకమని క్లబ్ సభ్యులు పేర్కొన్నారు. విద్య, ఉద్యోగం, విజ్ఞాన రంగాల్లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.