24 ఏళ్ల వయసులోనే డిప్యూటీ మేయర్‌గా ఎన్నికై చావలి చర్పిత అరుదైన గుర్తింపు పొందారు. ఒంగోలు నగరపాలక సంస్థలోని 27వ వార్డు నుంచి కార్పొరేటర్‌గా విజయం సాధించిన ఆమె తాజాగా డిప్యూటీ మేయర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. సోషల్ మీడియా రీల్స్‌తోనూ చర్పితకు గుర్తింపు ఉంది. SRM ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ టెక్నాలజీ నుంచి ఎంటెక్ పూర్తి చేశారు. ఆమె తండ్రి మున్సిపల్ కాంట్రాక్టర్‌గా పనిచేస్తుండగా, తాత గతంలో కౌన్సిలర్‌గా వ్యవహరించారు. వారి కుటుంబానికి టీడీపీతో 4 దశాబ్దాల అనుబంధం ఉంది. ఒంగోలు మేయర్‌గా నల్లమల్లి శ్రీశిల్ప బాధ్యతలు చేపట్టారు. ఇద్దరు కీలక పదవుల్లో మహిళలు నియమితులు కావడంతో పలువురు అభినందనలు తెలిపారు.
VIRAL
Andhra Pradesh, Prakasam
24 ఏళ్లకే డిప్యూటీ మేయర్‌గా యువతి
B.
Get instant news alerts in 60 words!
Download Breaking Now App on your smartphone.
Related Stories in VIRAL
రేకుల దుకాణానికి ₹2.12 లక్షల అద్దె
Nov 22,2026 11:44 am
సొరంగం తవ్వి పులి మళ్లీ పరార్
Nov 09,2026 09:30 pm