www.breakingnow.app | Tue, 24 Nov 2026
LATEST NEWS Andhra Pradesh, Tirupati

శ్రీవారి భక్తులకు యాత్ర సురక్ష భరోసా

Share:
128 Views
శ్రీవారి భక్తులకు యాత్ర సురక్ష భరోసా

శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు దేశంలోనే తొలిసారిగా ‘శ్రీవారి యాత్ర సురక్ష’ పథకం ద్వారా బీమా భరోసా కల్పిస్తున్నట్లు టీటీడీ సాధికారిక మండలి చైర్మన్, ఈవో ముద్దాడ రవిచంద్ర తెలిపారు. గత 2 నెలల్లో తిరుమలలో సహజ మరణం చెందిన 7గురు భక్తుల కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున బీమా పరిహారాన్ని అందజేశారు. టీటీడీ అదనపు ఈవో సీహెచ్. వెంకయ్య చౌదరి, ఎల్‌ఐసీ ఆఫ్ ఇండియా సీఈవో, ఎండీ ఆర్. దొరైస్వామితో కలిసి బాధిత కుటుంబాలకు బీమా చెక్కులను అందించారు. భక్తుల యాత్రకు భద్రత, భరోసా కల్పించడమే ఈ పథకం లక్ష్యమని పేర్కొన్నారు.

B.
Get instant news alerts in 60 words!

Download Breaking Now App on your smartphone.