కన్నాల గ్రామ అభివృద్ధే మా లక్ష్యం
NEWS Dec 11,2025 05:17 pm
పెద్దపల్లి/పాలకుర్తి: కన్నాల గ్రామ అభివృద్ధి, ప్రజల సంక్షేమమే తమ ఏకైక లక్ష్యమని సర్పంచ్ అభ్యర్థి భూతగడ్డల ప్రవళిక–కుమార్ తెలిపారు. ఇంటింటికీ ప్రచారం నిర్వహిస్తూ గ్రామ ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నట్టు చెప్పారు. విద్య, వైద్యం రంగాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం కల్పిస్తామని పేర్కొన్నారు. మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో గ్రామానికి మరిన్ని అభివృద్ధి పనులను తీసుకురావడానికి కృషి చేస్తామని తెలిపారు. రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో కత్తెర గుర్తుకు తమకు అనుకూలంగా ఓటు వేసి విజయం సాధింపజేయాలని గ్రామ ప్రజలను కోరారు.