ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య మృతి
NEWS Jan 31,2026 11:52 pm
గంజాయి ముఠా దాడిలో గాయపడిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య మృతి చెందారు. ఇటీవల నిజామాబాద్‌లో గంజాయి ముఠాను అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న ఆమె మృతి చెందారు. ఇటీవల నిజామాబాద్ శివారులో గంజాయి ముఠా హల్‌చల్ చేసింది. అర్ధరాత్రి తనిఖీలు చేస్తున్న ఎక్సైజ్ సిబ్బందిని కారుతో ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఎక్సైజ్ మహిళా కానిస్టేబుల్ గాజుల సౌమ్య తీవ్రంగా గాయపడ్డారు. ఘటన అనంతరం పోలీసులు స్మగ్లర్ల వాహనాన్ని వెంబడించి ఇద్దరిని అరెస్ట్ చేసి, 2 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. నిందితులను నిర్మల్ జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు.