చరణ్ - ఉపాసన దంపతులకు కవలలు
NEWS Feb 01,2026 01:07 am
రామ్ చరణ్ - ఉపాసన దంపతులు మరోమారు తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందారు. ఉపాసన శనివారం రాత్రి పండంటి కవలలకు (బాబు, పాప) జన్మనిచ్చారు. కవలలు పుట్టిన విషయాన్ని చిరంజీవి స్వయంగా తన ట్విట్టర్ ద్వారా తెలుపగా సెలబ్రిటీలు, ఫ్యాన్స్ నుంచి వెల్లువలా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మెగా వారసుడు వచ్చేసాడు అంటూ పండగ చేసుకుంటున్నారు.