మాజీమంత్రి అంబటి రాంబాబు అరెస్ట్
NEWS Jan 31,2026 11:57 pm
AP: వైసీపీ నేత, మాజీమంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. భారీ బందోబస్తు మధ్య అంబటిని తరలిస్తున్నారు. సీఎం చంద్రబాబుపై చేసిన అనుచిత వ్యాఖ్యలు కేసులో అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందే అరెస్ట్‌పై అంబటి రాంబాబు స్పందించారు. "దమ్ముంటే తనను అరెస్ట్ చేసుకోవాలి. మీ రెడ్‌బుక్‌కు నేను భయపడను.. ఐ డోంట్ కేర్ చంద్రబాబు" అంటూ ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు.