గ్రామాన్ని అభివృద్ధిలో ముందుంచుతా:
సర్పంచ్ నర్ల కనకమ్మ పొలురాజు
NEWS Dec 22,2025 07:28 pm
పెద్దకాల్వల గ్రామాన్ని మండలంలోనే అభివృద్ధిలో ముందంజలో నిలబెట్టేందుకు కృషి చేస్తానని సర్పంచ్ నర్ల కనకమ్మ పొలురాజు అన్నారు. సోమవారం సర్పంచ్‌తో పాటు నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం చేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ- పెద్దకాల్వల ప్రజలు, యువత తనపై నమ్మకంతో బాధ్యత అప్పగించారని, ఆ విశ్వాసానికి తగిన విధంగా గ్రామాభివృద్ధికి పనిచేస్తానని తెలిపారు. అనంతరం గ్రామస్థులు నూతన పాలకవర్గాన్ని శాలువాలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.