SIR పకడ్బందీగా నిర్వహించాలి
NEWS Dec 22,2025 07:32 pm
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌లో భాగమైన ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు ఆయన అన్ని జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నిర్దిష్ట కాలపరిమితిలో ఓటర్ మ్యాపింగ్ పూర్తి చేయాలని, ఓటరు జాబితాలో సరైన వివరాలు లేని ఓటర్లను గుర్తించి అవసరమైన సవరణలు చేసి జాబితాను ఆధునీకరించాలని సూచించారు.