మెట్‌పల్లి విద్యార్థినికి పార్లమెంటులో ప్రసంగించే అవకాశం
NEWS Dec 22,2025 07:26 pm
మెట్‌పల్లి పట్టణానికి చెందిన గట్టడి వర్షిత (గట్టడి దత్తాద్రి కుమార్తె)కు పార్లమెంటులో ప్రసంగించే అరుదైన అవకాశం దక్కింది. మెట్‌పల్లి బాలికల ఉన్నత పాఠశాల గైడ్ టీచర్ ఇంద్రాల సతీష్ ఈ విషయాన్ని తెలిపారు. ఈ నెల 25న వాజ్‌పేయ్, పండిత్ మదన్మోహన్ మాలవ్య జయంతుల సందర్భంగా పార్లమెంటులో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమానికి దేశవ్యాప్తంగా 36 మంది విద్యార్థులను ఎంపిక చేశారు. రాష్ట్రం నుంచి 5గురికి ఆహ్వానం లభించగా, ప్రసంగించే 13 మందిలో వర్షిత ఒక్కరే. ఆమె ప్రస్తుతం జోగిపేట పాలిటెక్నిక్ కళాశాలలో చదువుతోంది.