వెల్లుల్ల గ్రామ ప్రజలకు నల్లా పన్నులు లేవు
NEWS Dec 23,2025 01:53 pm
మెట్ పల్లి: చారిత్రాత్మక నిర్ణయాన్ని వెల్లుల్ల గ్రామ పంచాయతీ పాలకవర్గం తీసుకుంది. సర్పంచ్ గూడూరు తిరుపతి ప్రమాణ స్వీకారం అనంతరం గ్రామస్తులు ఐదేళ్ల పాటు నల్లా బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేదని నిర్ణయం తీసుకున్నారు. మిషన్ భగీరథ పనుల కారణంగా గ్రామంలో దెబ్బతిన్న రోడ్లను పూర్తిస్థాయిలో పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. నూతన పాలకవర్గ సభ్యులు పాల్గొని, గ్రామ అభివృద్ధికి సహకరించాలని నిర్ణయించారు.