అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి
NEWS Dec 23,2025 01:58 pm
సమాజ హితం కోసం పనిచేస్తున్న జర్నలిస్టులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వ స్థాయిలో తగిన న్యాయం జరగడం లేదని నిర్మల్ జిల్లా జర్నలిస్టులు ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు, ఇళ్ల స్థలాల కేటాయింపు, జర్నలిస్టు హెల్త్ స్కీమ్ అమలు వంటి కీలక అంశాల్లో ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని ఆరోపించారు. నిర్మల్ ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిర్మల్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షను ప్రారంభించారు. ప్రభుత్వం స్పందించి జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించే వరకు ఈ రిలే నిరాహార దీక్షలు కొనసాగుతాయని నిర్మల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు శ్రీధర్ స్పష్టం చేశారు.