మెట్ పల్లి మున్సిపల్ కార్యాలయంలో విజిలెన్స్ అధికారుల దాడులు
NEWS Dec 23,2025 01:17 pm
మెట్‌పల్లి మున్సిపల్ కార్యాలయంలో విజిలెన్స్ అధికారుల ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. విజిలెన్స్ ఎస్పీ ఆదేశాల మేరకు ఈ దాడులు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. తనిఖీల్లో భాగంగా మున్సిపల్ కార్యాలయంలోని వివిధ విభాగాలకు సంబంధించిన రికార్డులు, ఫైళ్లను విజిలెన్స్ అధికారులు సవివరంగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. అవకతవకలు, నిబంధనల ఉల్లంఘనలు జరిగాయా లేదా అనే కోణంలో విచారణ కొనసాగుతున్నట్లు సమాచారం. విజిలెన్స్ తనిఖీలతో మున్సిపల్ కార్యాలయ సిబ్బందిలో కలకలం నెలకొంది.