ఘనంగా రైతు దినోత్సవ వేడుకలు
NEWS Dec 23,2025 09:49 pm
కథలాపూర్ (మం) బొమ్మెన గ్రామంలో రైతు దినోత్సవ వేడుకలను విడిసి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విడిసి అధ్యక్షులు తీపి రెడ్డి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. రైతు లేనిదే రాజ్యం లేదని, రైతు నాగల చేతబట్టి శ్రమిస్తేనే దేశం అభివృద్ధి బాటలో ముందుకు సాగుతుందని అన్నారు. ప్రభుత్వం రైతులపై చిన్నచూపు మానేసి వారి సంక్షేమంపై మరింత శ్రద్ధ చూపాలని కోరారు. అనంతరం గ్రామంలో ఎడ్ల బండితో దున్నుతున్న రైతు విగ్రహాలకు పూలమాలలు వేసి, స్వీట్లు పంపిణీ చేశారు. సర్పంచ్ సుధాకర్, ఉపసర్పంచ్ తిరుపతి, రైతు నాయకులు మహిపాల్ రెడ్డి, శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.