బీజేపీలోకి సర్పంచ్, అనుచరులు
NEWS Dec 23,2025 09:45 pm
సారంగాపూర్ మండలం హనుమాన్ తండా గ్రామ సర్పంచ్ పవర్ పుష్పలత జ్ఞానేశ్వర్, మాజీ ఎంపీపీ, మాజీ సర్పంచ్ పవర్ రాజేష్, ఉపసర్పంచ్ ప్రహ్లాద్‌తో పాటు పలువురు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. బీజేపీ ఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సమక్షంలో జరిగిన కార్యక్రమంలో ఆయన వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి కరిపే విలాస్, కంకేట సర్పంచ్ సోహెబ్, చెన్న రాజేశ్వర్‌తో పాటు ఇతర నాయకులు పాల్గొన్నారు.