వీకెండ్ వండర్స్ ఆఫ్ తెలంగాణ పోటీలు
NEWS Dec 23,2025 09:43 pm
నిర్మల్ జిల్లా యువజన క్రీడల, టూరిజం శాఖ ఆధ్వర్యంలో ‘100 వీకెండ్ వండర్స్ ఆఫ్ తెలంగాణ’ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. అధికారులు మాట్లాడుతూ.. కవులు, రచయితలు, ఫోటోగ్రాఫర్లు రాష్ట్రంలోని పెద్దగా గుర్తింపు పొందని పర్యాటక ప్రాంతాలపై ఫోటోలు, వీడియోలు, వివరాలు సిద్ధం చేసి గూగుల్ ఫామ్ లేదా సోషల్ మీడియా ద్వారా తెలంగాణ పర్యాటక శాఖను ట్యాగ్ చేస్తూ పంపవచ్చని తెలిపారు. పూర్తి వివరాలకు www.tourism.telangana.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.