చోరీకి గురైన ద్విచక్ర వాహనాలు పట్టివేత
NEWS Dec 23,2025 09:41 pm
ఇచ్చోడ మండలంలో చోరీకి గురైన మొత్తం 34 ద్విచక్ర వాహనాలను పోలీసులు పట్టుకున్నారు. మహారాష్ట్రలో చోరీ అయిన వాహనాల కోసం గాలింపు చేపట్టిన నాందేడ్ జిల్లా క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆదిలాబాద్ జిల్లాలో తనిఖీలు నిర్వహించారు. ఇచ్చోడ మండలంలోని గుండాల, కేశవపట్నం, ఎల్లమ్మగూడ, సిరిచెల్మ గ్రామాల్లో తనిఖీలు చేసి చోరీ బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 34 వాహనాలు పట్టుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.