గ్రామ ప్రత్యేక అధికారి డా. మనీషా పటేల్ ఆధ్వర్యంలో పాలకవర్గానికి సన్మానం
NEWS Dec 23,2025 09:37 pm
చౌలమద్ది గ్రామంలో గ్రామ ప్రత్యేక అధికారి డా. మనీషా పటేల్ ఆధ్వర్యంలో కొత్తగా ఎన్నికైన గ్రామ పంచాయితీ పాలకవర్గానికి ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్ కనుక భారతి, ఉపసర్పంచ్‌తో పాటు వార్డు సభ్యులను సన్మానించారు. గ్రామ ప్రత్యేక అధికారిగా సమర్థవంతమైన సేవలు అందించిన డా. మనీషా పటేల్‌ను గ్రామపంచాయితీ పాలకవర్గం, గ్రామ కార్యదర్శి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా సన్మానించారు.