పల్లెవెలుగు’ కూడా ఏసీ ఉండాల్సిందే!
NEWS Dec 23,2025 09:35 pm
ఏపీఎస్ఆర్టీసీలో ఇకపై ప్రవేశపెట్టే అన్ని కొత్త ఎలక్ట్రిక్ బస్సులు ‘పల్లెవెలుగు’ సహా తప్పనిసరిగా ఏసీ సౌకర్యంతో ఉండాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 1,450 ఈవీ బస్సులు కొనుగోలు చేయాలని, ఐదేళ్లలో 8,819 డీజిల్ బస్సులను ఈవీలతో భర్తీ చేయాలని నిర్ణయించారు. గోదావరి పుష్కరాల నేపథ్యంలో జిల్లాల్లో ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు టెండర్లు పిలవాలని సూచించారు.