రాష్ట్రస్థాయికి ఎంపికైన హర్షిత్
NEWS Dec 23,2025 11:29 pm
కథలాపూర్ (మం) బొమ్మన గ్రామానికి చెందిన విద్యార్థి హర్షిత్ రాష్ట్ర స్థాయి వాలీబాల్‌తో పాటు అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికైనట్లు వార్డు ఫోరం అధ్యక్షులు వెంకటస్వామి తెలిపారు. బొమ్మన గ్రామం తరఫున హర్షిత్‌కు ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతూ విద్యార్థులు మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలకు పరిమితం కాకుండా క్రీడల్లో చురుగ్గా పాల్గొంటే జ్ఞాపకశక్తి పెరుగుతుందని, శారీరకంగా ఆరోగ్యవంతులుగా తయారవుతారని చెప్పారు. గ్రామం నుంచి రాష్ట్ర స్థాయికి ప్రతిభ కనబరచడం గర్వించదగ్గ విషయమని పేర్కొన్నారు. క్రీడల పట్ల ఆసక్తి ఉన్న విద్యార్థులకు ప్రత్యేక శ్రద్ధతో ప్రోత్సాహం అందిస్తామని తెలిపారు.