VHP ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ దగ్ధం
NEWS Dec 24,2025 09:06 pm
కథలాపూర్: బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న హత్యాకాండను, ఇటీవల దీపు చంద్ర కిరాతక హత్యను ఖండిస్తూ కథలాపూర్ బస్టాండ్ వద్ద విశ్వహిందూ పరిషత్ - బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ దగ్ధం చేసి నిరసన నిర్వహించారు. హింసను తక్షణమే ఆపి హిందువులకు రక్షణ కల్పించాలని బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరారు.