వేడెక్కిస్తోన్న కేసీఆర్ - రేవంత్!
NEWS Dec 24,2025 09:03 pm
తెలంగాణలో కేసీఆర్, రేవంత్ రెడ్డి మధ్య విమర్శలు, ప్రతివిమర్శలతో రాజకీయాలు వేడెక్కాయి. ప్రజా సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగడతామంటూ ఇటీవల కేసీఆర్ వ్యాఖ్యానించారు. దీంతో ఈ నెల 29 నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో చర్చకు సిద్ధమా? అంటూ రేవంత్ సవాల్ విసిరారు. దీన్ని KCR స్వీకరిస్తారా లేదా అనేది ఆసక్తిగా మారింది. ఒకవేళ ఆయన అసెంబ్లీకి వెళ్తే రేవంత్ Vs కేసీఆర్ మాటల యుద్ధంతో సభ దద్దరిల్లడం ఖాయం.