రాష్ట్ర సర్పంచ్‌ల ఫోరం ఉపాధ్యక్షుడిగా శివగోని పెంటగౌడ్
NEWS Dec 30,2025 06:47 pm
తెలంగాణ రాష్ట్ర సర్పంచ్‌ల ఫోరం ఉపాధ్యక్షుడిగా మనోహరాబాద్ మండలం లింగారెడ్డిపేట సర్పంచ్ శివగోని పెంట గౌడ్ నియమితులయ్యారు. మంగళవారం లకిడికపూల్‌లోని శ్రీ వెంకటేశ్వర ఫంక్షన్ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ నియామకం చేపట్టారు. ఈ సందర్భంగా గజ్వెల్ కాంగ్రెస్ ఇంచార్జ్ నర్సారెడ్డి, మంత్రి సీతక్కలకు సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజాసేవే లక్ష్యంగా సర్పంచ్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పెంట గౌడ్ ప్రకటించారు.