ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన
NEWS Dec 30,2025 06:46 pm
పాల్వంచ మండలంలోని పాయకారి యానాంబైలు గ్రామంలో సీతారామాంజనేయ స్వామి దేవాలయ నిర్మాణానికి సర్పంచ్ పూనెం సూరమ్మ గ్రామస్తుల సమక్షంలో శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాములోరి దయతో ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని ప్రార్థించారు. పంచాయతీ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని, అందరి సహకారంతో ఆలయ నిర్మాణం పూర్తి చేసి త్వరలో ప్రారంభోత్సవం చేస్తానని తెలిపారు. గ్రామస్తులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.