బైఠాయించిన మున్సిపల్ కార్మికులు
NEWS Dec 30,2025 06:48 pm
బైంసా మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికులు అత్యల్ప వేతనాలతో పనిచేస్తున్నామని ఆరోపిస్తూ గత కొన్ని రోజులుగా సమ్మె కొనసాగిస్తున్నారు. డిమాండ్ల సాధన కోసం కార్మికులు ఈరోజు జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని ఛాంబర్ ముందు బైఠాయించారు. కొత్త మున్సిపాలిటీల్లో ఉన్నత వేతనాలు అందుతున్న నేపథ్యంలో, వారితో సమానంగా వేతనాలు ఇవ్వాలని, ప్రతి నెలా సమయానికి చెల్లింపులు జరగాలని కోరుతున్నారు.