ఆలయంలో ముక్కోటి సందర్భంగా పూజలు
NEWS Dec 30,2025 06:44 pm
పాల్వంచలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో ముక్కోటి సందర్భంగా ఉత్తర ద్వార వైకుంఠ దర్శనాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ప్రధాన అర్చకులు వంశీ, మురళి ఆచార్యులు భక్తులకు స్వామి విశిష్టత తెలియజేసి అష్టోత్తర శతనామావళి పూజలు చేశారు. భక్తులు అశేషంగా తరలివచ్చారు. దేవాలయ కమిటీ తీర్థప్రసాదాలు పంపిణీ చేసింది. మాజీ ధర్మకర్త చలవాది ప్రకాష్–రాజ్యలక్ష్మి దంపతులు, ఈవో రజినికుమారి పర్యవేక్షణ చేశారు. దేవాలయ సిబ్బంది కాశీ, శివ, నరసమ్మ పాల్గొన్నారు.