ప్రపంచం ఉలిక్కిపడేలా బంగారం!
NEWS Dec 30,2025 06:42 pm
ప్రస్తుతం ప్రపంచ బంగారు ఉత్పత్తిలో 10% వాటాతో 377 టన్నులు ఉత్పత్తి చేస్తున్న చైనా, తాజాగా వరుసగా భారీ నిక్షేపాలను గుర్తిస్తోంది. లియోనింగ్‌లో 1,444 టన్నులు, జిన్జియాంగ్‌లో 1,000 టన్నులు, హునాన్‌లో 1,000 టన్నుల అధిక నాణ్యత గల బంగారం గనిని గుర్తించారు. సముద్రం అడుగున 3,900 టన్నుల బంగారు నిధిని చైనా తొలిసారి గుర్తించింది. అత్యాధునిక డీప్-ఎర్త్, ఏఐ టెక్‌తో గనుల అన్వేషణలో చైనా ముందంజలో నిలుస్తోంది. కొత్తగా కనిపెట్టిన బంగారు గనుల నుంచి చైనా తవ్వకాలు ప్రారంభిస్తే.. బంగారం ధరలను డిసైడ్ చేసే శక్తిగా డ్రాగన్ కంట్రీ అవతరించవచ్చంటున్నారు.