ఏసీబీ వలలో ల్యాండ్ సర్వేయర్
NEWS Dec 30,2025 10:30 pm
నిర్మల్ జిల్లా కేంద్రంలో ల్యాండ్ సర్వేయర్ లంచం తీసుకుంటూ ఏసీబీ బారిన పడ్డాడు. కొండాపూర్‌కు చెందిన చిన్నయ్య భూమి కొలతల కోసం సర్వేయర్ బాలకృష్ణను సంప్రదించగా, అతడు ₹15,000 లంచం డిమాండ్ చేశాడు. ముందే ₹5,000 తీసుకుని, మొత్తాన్ని ₹7,500కి తగ్గించారు. సాయంత్రం 4.30కు చిన్నయ్య బాలకృష్ణ, అసిస్టెంట్ నాగరాజుకు డబ్బులు ఇస్తుండగా ఏసీబీ దాడి చేసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. నిందితులను ఎమ్మార్వో కార్యాలయానికి తరలించి పంచనామా నిర్వహించారు.