జిల్లాలో ఎరువులకు కొరతలేదు: కలెక్టర్
NEWS Dec 30,2025 10:26 pm
భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో యాసంగి సీజన్‌కు రైతులకు అవసరమైన యూరియా ఎరువులు సమృద్ధిగా ఉన్నాయని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తెలిపారు. మొక్కజొన్న, వరి ప్రధాన పంటలుగా సాగుతున్న ఈ సీజన్‌లో ఇప్పటివరకు 38,500 ఎకరాల్లో మొక్కజొన్న, 8,750 ఎకరాల్లో వరి పంటలు సాగు అయ్యాయి. వరి నాట్లు కొనసాగుతున్నాయని, మరిన్ని ఎకరాలు పెరిగే అవకాశమున్నట్లు చెప్పారు.