ప్రియాంక కాబోయే కోడలు అవివా
NEWS Dec 30,2025 10:25 pm
కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ కుమారుడు రైహాన్ వద్రా త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్నాడు. ఢిల్లీకి చెందిన ఫోటోగ్రాఫర్, 'అటెలియర్ 11' కో-ఫౌండర్ అవివా బేగ్‌తో ఆయన నిశ్చితార్థం జరిగింది. గత 7 ఏళ్లుగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు. 2 కుటుంబాల సమ్మతితో రాజస్థాన్ రణథంబోర్‌లో నిశ్చితార్థం, న్యూ ఇయర్ వేడుకలు జరుగుతున్నాయి. అవివా ఓపీ జిందాల్ యూనివర్సిటీలో జర్నలిజం చదివింది. రైహాన్ కూడా విజువల్ ఆర్టిస్ట్‌గా, వైల్డ్ లైఫ్–స్ట్రీట్ ఫోటోగ్రఫీలో ప్రత్యేక గుర్తింపు పొందాడు.