మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో
టైలరింగ్ కోచింగ్ సర్టిఫికెట్ల పంపిణీ..
NEWS Dec 31,2025 12:12 am
తెలంగాణ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్మల్ పట్టణంలోని మైనారిటీస్ మహిళలకు 3 నెలల ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సును తెలంగాణ ముస్లిం ఏక్తా సంఘం తరపున అధ్యక్షులు షేక్ ముజాహిద్ శిక్షణ ఇచ్చారు. ముఖ్య అతిథులుగా TPCC ప్రధాన కార్యదర్శి ఎంబడి రాజేశ్వర్, ఎంసీఏ లింగన్న పాల్గొన్నారు. ట్రైనింగ్ పూర్తి చేసుకున్న మహిళలకు వారి చేతుల మీదుగా రిటైర్డ్ ఉద్యోగుల సంఘం హాల్లో సర్టిఫికెట్లను పంపిణీ చేశారు.. ఈ సందర్భంగా TPCC ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ మాట్లాడుతూ.. తెలంగాణ ముస్లిం ఏక్తా సంఘంకు ప్రభుత్వ పరంగా సహాయ సహకారాలు అందిస్తామన్నారు.