రియల్టర్‌పై హనీ ట్రాప్, 10లక్షలు డిమాండ్
NEWS Dec 30,2025 06:30 pm
మెట్‌పల్లికి చెందిన ఓ రియల్టర్‌ను లక్ష్యంగా చేసుకుని ముఠా బ్లాక్‌మెయిల్ డ్రామా నడిపింది. పట్టణానికి చెందిన ఓ మహిళను ఎరగా వాడి, ఇద్దరూ ఏకాంతంగా ఉన్న సమయంలో ఫోటోలు, వీడియోలు తీసి రియల్టర్‌ను బెదిరించారని సమాచారం. ₹10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసిన ముఠాకు రియల్టర్ తెలివిగా వలపన్నాడు. సెటిల్‌మెంట్ పేరుతో పిలిచి పోలీసులకు సమాచారమిచ్చి ముఠా సభ్యులను పట్టించారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు, పరారీలో ఉన్న ఇతరుల కోసం గాలింపు ప్రారంభించినట్టు సమాచారం.